ముందుకెళ్తున్న శీనయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు వివి వినాయక్ హీరోగా కనిపించాల్సిన సినిమా -శీనయ్య. ఆట్టహాసంగా మొదలై కొద్దిరోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రం.. ఇప్పుడు ఉందో లేదో వస్తుందో రాదో తెలీకుండా పోయింది. నిర్మాత దిల్ రాజును దర్శకుడు నరసింహరాజు స్క్రిప్ట్‌తో సంతృప్తిపర్చలేకపోయిన కారణంగానే సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ కొంతకాలం ప్రచారం జరిగింది. కథనాలు వినిపించినట్టే -ఇండస్ట్రీలో శీనయ్య ఊసే లేకుండాపోయింది. దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన వినాయక్ -నటుడిగా చేస్తున్న తొలి ప్రయత్నమే బెడిసికొట్టినట్టయ్యింది. అయితే, దాదాపుగా ఆపేసిన చిత్రం మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోందంటూ ఇండస్ట్రీలో తాజా కథనాలు వినిపిస్తున్నాయి. శీనయ్య సినిమా ఫలితం మాటెలావున్నా -సినిమానైతే పూర్తి చేయాలని దిల్‌రాజు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సో, స్క్రిప్ట్ సంతృప్తికరంగా లేకున్నా.. షూట్‌కు వెళ్లాలని నిర్ణయించారని తెలుస్తోంది. నటుడిగా వినాయక్‌కు తొలి సినిమా కనుక -ఏదోలా పూర్తి చేసి వేసవి చివర్లో సినిమాను థియేటర్లకు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారన్న మాట వినిపిస్తోంది.