అందుకే.. గ్యాప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలనటుడిగా చాలా సినిమాలే చేశా. ఉన్నత చదువు కోసం గ్యాప్ తీసుకుంటే -సింగపూర్, మలేసియా వెళ్లిపోయానని అనుకున్నారు. సిఏ ప్రాక్టీస్ చేస్తూనే, ఇక్కడున్నపుడు నటిస్తానని అందరికీ కమ్యూనికేట్ చేశాను. అయితే నచ్చిన పాత్రలు రాలేదు. వచ్చినవి నచ్చలేదు -అంటున్నాడు యువహీరో బాలాదిత్య. మాస్టర్ రవితేజ, అన్నపూర్ణమ్మ, జమున ప్రధాన తారాగణంగా శివనాగు దర్శకత్వంలో ఎంఎన్‌ఆర్ చౌదరి రూపొందించిన చిత్రం -అన్నపూర్ణమ్మగారి మనవడు. ఈ చిత్రంలో బాలాదిత్య కీలకమైన పాత్ర చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. బాలనటుడిగా ఆడియన్స్‌కి తెలిసిన వాడినే. తరువాత చంటిగాడు సినిమా చేసినప్పటికి 19ఏళ్లే. అయితే -సినిమాలకు కావాలని గ్యాప్ తీసుకోలేదు. సినిమాతోనే ప్రయాణిస్తున్నా. కాకపోతే -అమ్మకిచ్చిన మాటకోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ముంబయికి వెళ్లా. అన్నపూర్ణమ్మగారి మనవడు చిత్రంలో -ప్రణయ్, అమృత ప్రేమకథలో ప్రణయ్ పాత్ర చేశా. అమృతగా అర్చన కనిపిస్తుంది. అన్నపూర్ణమ్మ మనవడి పాత్రతోపాటు, ఈ కథా ఉంటుంది. సినిమాటిక్‌గా అనేక మార్పులు చేసుకుంటూ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నాలుగురోజుల్లో పూరె్తైంది. ప్రస్తుతం తమిళంలో రాసాత్తి సీరియల్‌లో నటిస్తున్నా. సన్ టీవీలో వస్తోన్న సీరియల్‌కు మంచి రేటింగ్ వుంది.