ట్రైలర్‌లో ఎమ్‌ఎమ్‌ఓఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెడి చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్‌ నందం లీడ్‌రోల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రొడక్షన్, జెకె క్రియేషన్స్ పతాకాలపై జిడి ఖాశిం రూపొందించిన చిత్రం -ఎమ్‌ఎమ్‌ఓఎఫ్. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -‘ట్రైలర్ చూశాక నేను స్లో అయ్యానా? లేక సినిమా తీసినోళ్లు ఫాస్ట్‌గా ఉన్నారా? అన్న సందేహం తలెత్తింది. ట్రైలర్ చూస్తే -సినిమా చూడాలి.. అనేంత కొత్తగా ఉంది. జెడి చక్రవర్తి ఇలాంటి కొత్త కానె్సప్ట్ చిత్రాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ -జెడి చక్రవర్తితో కలిసి చాలాకాలం తరువాత సినిమా చేస్తున్నా. మంచి పాత్ర, కథ కథనాలు నచ్చి చేశాను. డిఫరెంట్ మేకింగ్‌ను సినిమా ద్వారా దర్శకుడు పరిచయం చేస్తున్నాడు. అందరికీ నచ్చుతుంది అన్నారు. మనోజ్ నందం మాట్లాడుతూ -ఈ చిత్రంలో కొత్తతరహా పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా అన్నారు. దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ -సినిమాను వెంటనే చూడాలన్నంత ఆసక్తికరంగా ట్రైలర్ ఉందన్నారు. శ్రీరామ్‌చంద్ర, టార్జాన్, గౌతమ్‌రాజు, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.