అమ్మకు ప్రేమతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతకడానికి, చనిపోవడానికి మధ్య జరిగే సంఘటన సమాహారంలో తల్లి పాత్ర ఎంతటి మహోన్నతమైనదో వివరిస్తూ యస్.వి.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వైష్ణవి శ్రీనివాస్, భరత్.కె.ఎస్. నిర్మాతలుగా యువ దర్శకుడు శ్రీకాంత్ గూటూరి తీసిన ‘అమ్మకు ప్రేమతో’ షార్ట్ ఫిలింకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. యం.బి.ఎ చేసి ఉద్యోగం చేస్తున్నా తాను దర్శకుడు కావాలనే కోరికతో వైవిధ్యభరితమైన కథా ఇతివృత్తాన్ని ఎన్నుకొని చేసిన చిరు ప్రయత్నమే ఈ షార్ట్ ఫిలిం. ఈ ఫిలింను ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రముఖులకు, స్నేహితులకు బంధు, మిత్రులకు ప్రదర్శించిన సందర్భంగా వారి నుండి అపూర్వ స్పందన లభించిందని దర్శకుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో సెకెండ్ హీరోయిన్‌గా చేసిన పునర్నవి అనే అమ్మాయి ఈ షార్ట్ ఫిలింలో నటించడానికి ధైర్యం చేయడమే గొప్ప విషయమని, షార్ట్ ఫిలింలో చేయడానికి అంగీకరించడానికి తీసుకున్న కథా ఇతివృత్తం ఎంతో గొప్పది కావడమే కారణమని అన్నారు. కత్తి మహేష్ మాట్లాడుతూ, చావుకి, బ్రతుక్కి మధ్య జరిగే కథను తక్కువ నిమిషాలలో చూపించి మెపిప్చడం గొప్ప విషయమని, ఏడు నిమిషాలలో ఓ జీవితాన్ని షార్ట్ ఫిలింలో చూపించడం అనేది గొప్ప ప్రయత్నమని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ గూటూరి మాట్లాడుతూ, రెగ్యులర్ సినిమాల జోలికి వెళ్లకుండా కొత్తదనంతో చేసిన చిరు ప్రయత్నం ఇదన్నారు. హీరోయిన్ పునర్నవి మాట్లాడుతూ, ఇందులో అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చాయని, ప్రతి తల్లి బిడ్డల్ని ఎంతో గొప్పగా చూసుకుంటుందని, ఆ బిడ్డలు తల్లికోసం ఏంచేశారనేది అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. దర్శకుడు తల్లి మాట్లాడుతూ, చాలా ఆనందంగా, గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.