‘ఏయ్ పిల్లా’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం -లవ్‌స్టోరీ. ఇప్పటికే ప్రివ్యూతో ఆసక్తి రేకెత్తించిన -ఏయ్ పిల్లా సాంగ్ పూర్తి లిరికల్‌ను బుధవారం విడుదల చేస్తున్నారు. ఎమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై నారాయణదాస్ కె నారంగ్, పి రాంమోహన్‌రావు సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రమిది. హోలీ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని నిర్మాతలు అంటున్నారు. బైక్‌పై వచ్చిన కథానాయకుడు నాగచైతన్యను సాయిపల్లవి టీజ్ చేస్తున్నట్టున్న స్టిల్ ఆకట్టుకుందని అంటున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో -పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తిచేసి సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ప్రేమ కథే -లవ్ స్టోరీ.