బుజ్జిగాడి వూసేదీ..?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒరేయ్ బుజ్జిగా.. అని ఎంత గట్టిగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. విడుదల తేదీ దగ్గర పడుతున్నా -ప్రమోషన్స్ బజ్ లేకపోవడంతో ఒరేయ్ బుజ్జిగాపై మొదట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు కనిపించటం లేదు. ఎంత గొప్ప సినిమాకైనా -విడుదలకు ముందు తెచ్చే హైపే ప్రాణమవుతోన్న పరిస్థితి ఇప్పటి సినిమాలది. రాజ్‌తరుణ్, మాళవికా నాయర్ జోడీగా కొండా విజయ్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -ఒరేయ్ బుజ్జిగా. ఫ్లాప్‌లతో పూర్తిగా వెనుకబడిపోయిన రాజ్‌తరుణ్‌కు ఈ సినిమా హిట్ తప్పనిసరి. ఇక మాళవికా నాయర్ కెరీర్ సైతం ఉత్సాహంగా లేదు. చేతిలో సినిమాలే లేని పరిస్థితుల్లో ఒరేయ్ బుజ్జిగా చేస్తోంది. కెరీర్ మళ్లీ ముందుకు కదలాలంటే -ఈ సినిమా హిట్టు అనివార్యం. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చే ఉద్దేశంతో -హెబ్బా పటేల్‌కూ గ్లామర్ డోస్‌వున్న ప్రత్యేక పాత్ర కల్పించారు. ఈ సినిమా వర్కౌటైతే -ఫేడవుటైన హెబ్బాపటేల్‌కు మళ్లీ చాన్స్‌లు తగలొచ్చు. దర్శకుడు కొండా విజయకుమార్, నిర్మాత రాధామోహన్‌కూ ఈ సినిమా హిట్ తప్పనిసరి. ఓరేయ్ బుజ్జిగా.. టైటిల్ చిన్నపిల్లల సినిమాలా ఉందన్న విమర్శలు వస్తున్నా -సినిమాకు క్రేజ్ తెచ్చేందుకు టీం చేస్తున్న ప్రయత్నాలేవీ కనిపించటం లేదు. స్టార్ హీరోల సినిమాలైనా భారీ ప్రమోషన్లతోనే బతికి బట్టకడుతున్న పరిస్థితుల్లో -ఈ చిత్రానికి సంబంధించి బజ్ క్రియేట్ చేసే పరిస్థితి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంలో చిత్రబృందం ధైర్యమేమిటో -వచ్చే రోజుల్లో చూపిస్తారేమో చూడాలి.