ఛేజింగ్‌లో జాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరోనా దెబ్బకు విదేశీ షూటింగ్‌లు నిలిచిపోతున్న తరుణంలో -ప్రభాస్ చేస్తున్న జాన్ షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయంటూ కథనాలు చక్కర్లుకొట్టాయి. యూరోప్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ దర్శకుడు రాధాకృష్ణ స్పష్టం చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ -ప్రభాస్ 20వ ప్రాజెక్టు యూరోప్‌లో అవాంతరం లేకుండా సాగుతోంది. అద్భుతమైన ఛేజింగ్ సీన్‌ను అంతర్జాతీయ టెక్నీషియన్స్‌తో చిత్రీకరించాం. యూరప్‌లో ఇంకా షూటింగ్ చేయాల్సి వుంది. కంటిన్యూ చేస్తాం అంటూ స్పష్టం చేశాడు. పాన్ ఇండియా మూవీ సాహో తరువాత, ఆ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టుకు మొదట జాన్ టైటిల్ అంటూ ప్రచారం జరిగింది. ఆ టైటిల్‌తో శర్వా మూవీ ‘జాను’ వచ్చేయటంతో -ఓ డియర్ టైటిల్‌ని కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉందంటూ వార్తలొస్తున్నాయి. యూరోప్ షూట్ పూర్తి చేసుకుని వచ్చిన తరువాత -సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్స్ ఇవ్వడానికి చిత్రబృందం రెడీ అవుతోందని తెలుస్తోంది. అందులో భాగంగానే టీజర్ బయటకు రావొచ్చని సమాచారం. దసరాకు థియేటర్లకు తెచ్చే ఆలోచనతో చిత్రీకరణను వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్‌తో పూజా హెగ్దె రొమాన్స్ చేస్తున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీలో -బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రలు పోషిస్తుండటం తెలిసిందే.