మళ్లీ.. బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బన్నీకి బంపర్ హిట్టివ్వడానికి సుక్కూ ఎంత తొందర పడుతున్నాడో -పరిస్థితులు అంత వెనక్కి లాగుతున్నాయి. నిజానికి బన్నీ -సుక్కూ కాంబోలో రావాల్సిన హ్యాట్రిక్ ప్రాజెక్టు ఏఏ20 షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నారు. కీలక సన్నివేశాల షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా -అడుగుమాత్రం ముందుకు పడటం లేదు. ఫారెస్ట్ నేపథ్యంగా సాగే కథ కనుక -కీలక సన్నివేశాలను బ్యాంకాక్ ఫారెస్ట్ లోకేషన్స్‌లో ప్లాన్ చేశాడట దర్శకుడు సుకుమార్. సరిగ్గా అదే టైంలో అల.. వైకుంఠపురంలో సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టనిపించుకోవడంతో -సెలబ్రేషన్స్ కోసం బ్రేక్ తీసుకున్నాడు హీరో అల్లు అర్జున్. సుదీర్ఘంగా సాగిన సెలబ్రేషన్స్ కారణంగా ప్రాజెక్టుకు బ్రేక్ తప్పలేదు. తరువాత.. బ్యాకాంక్ ట్రిప్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన టైంలో -కరోనా ఉధృతరూపం దాల్చింది. కరోనా దెబ్బకు అల్లాడుతున్న తూర్పు ఆసియా దేశాల్లో బ్యాంకాంక్ సైతం ఉండటంతో -షెడ్యూల్‌ను మళ్లీ వాయిదా వేశారు. ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి వచ్చే దసరాకే సెట్స్‌పైకి తెద్దామన్న నిర్మాతల ప్రతిపాదన మేరకు -్ఫరెస్ట్ షెడ్యూల్ మొత్తాన్ని కేరళలో పూర్తి చేయడానికే సుక్కూ ప్లాన్ చేశాడట. ఆ ప్లాన్‌కూ బ్రేక్ వేస్తూ -కేరళలో కరోనా పాజిటివ్ కేసులు పెరగటంతో ఏఏ20 టీం మళ్లీ అయోమయంలో పడింది. కరోనా దెబ్బకు కేరళలో మార్చి 31 వరకూ థియేటర్లు మూసేసే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇంతటి అననుకూల పరిస్థితుల్లో షూట్‌కి వెళ్లేకంటే -కొద్దినెలలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమన్న ఆలోచనలో సుక్కూ టీం ఉందని సమాచారం. శేషాచలం అడవుల్లో జరిగే స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కనున్న ప్రాజెక్టులో రష్మిక మండన్న హీరోయిన్‌గా, విజయ్ సేతుపతి విలన్ పాత్రలు పోషించనున్నారు.