అసలేం జరిగిందంటే!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మహేంద్రన్, శ్రీపల్లవి, కారుణ్యచౌదరి, కరోన్య కత్రిన్ లీడ్‌రోల్స్‌లో దర్శకుడు శ్రీనివాస్ బండారి తెరకెక్కిస్తోన్న చిత్రం -అసలు ఏంజరిగిందంటే. ఏబీఆర్ ప్రొడక్షన్స్, జిఎస్ ఫిల్మ్స్ పతాకంపై అనిల్ బొద్దిరెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 20న సినిమా విడుదలవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ -ఏదైనా ఒక ప్రత్యేక విషయం చెప్పడానికి చాలా సందర్భాల్లో తెలుగువాళ్లు ఉపయోగించే ఉపోద్ఘాత పదం -అసలు ఏంజరిగిందంటే. అందుకే ఓ కథను సినిమాగా చెప్తున్నాం కనుక ఈ టైటిల్ పెట్టాం. మనిషి జీవితంలో జరిగిపోయింది తెలుస్తుంది తప్ప, జరగబోయేది ఎవ్వరికీ తెలీదు. అది తెలిసింది దేవుడొక్కడే. సో, మనిషి కాలంతోపాటు పరిగెత్తడం తప్ప ముందు ఏంజరుగుతుందో తెలుసుకోలేడు. ఆ విషయానే్న సినిమాలో చెప్పాం. నిజానికి ఇది అనుభవమున్న పెద్ద హీరో చేయాల్సిన కథ. బట్, నేను కొత్తవాడిని కనుక పెద్ద హీరోతో సాధ్యం కాదు. అందుకే -150 సినిమాల అనుభవమున్న బాలనటుడు మహేంద్రన్‌ను ఈ పాత్రతో హీరో చేస్తున్నా. మహేంద్రన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకు తగ్గట్టే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక చరణ్ అర్జున్ ఇచ్చిన మ్యూజిక్, కర్ణ ప్యారసాని సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సహకారంతో మంచి సినిమా చేశాం. ఇదొక మంచి సినిమా అని చెప్పడానికి -ఒక్క కట్ లేకుండా సెన్సార్ ఇచ్చిన యు సర్ట్ఫికేట్. మా ప్రయత్నాన్ని ప్రోత్సహించి సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నా అన్నారు. హీరో మహేంద్ర మాట్లాడుతూ -తెలుగు స్క్రీన్‌పై టాలెంటెడ్ హీరోలు చాలామందే ఉన్నారు. వాళ్లమధ్య నేనూ నిలబడాలంటే ‘సమ్‌థింగ్ స్పెషల్ స్టోరీ’తో హీరో అవ్వాలనుకున్నా. అలాంటి స్పెషల్ స్టోరీలో రగ్డ్ క్యారెక్టర్ చేస్తున్నా. బాలనటుడిగా ఆదిరించారు. హీరోగానూ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సల్మాన్, తటవర్తి కిషోర్, కుమనన్ తదితరులు మాట్లాడారు.