ఫన్ లవ్.. విఠల్‌వాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌ఎన్ ఎక్స్‌పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రోహిత్, కైషా రావత్ జోడీగా టి నాగేందర్ తెరకెక్కిస్తోన్న చిత్రం -విఠల్‌వాడి. జి నరేష్‌రెడ్డి నిర్మించిన చిత్రం మార్చి 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో రోహిత్ మాట్లాడుతూ -విఠల్‌వాడి సినిమా కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు నాగేంద్ర సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. 20న విడుదలవుతోన్న చిత్రాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం అన్నారు. హీరోయిన్ కైషా రావత్ మాట్లాడుతూ -హీరో రోహిత్‌తో చేసిన వర్క్ మెమరబుల్. ఇది సరదాగా సాగే లవ్ స్టోరీ. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు మంచి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం అన్నారు. దర్శకుడు నాగేంద్ర మాట్లాడుతూ -నన్ను నమ్మి సినిమా అప్పగించిన నిర్మాతకు ధన్యవాదాలు. ఒక సింపుల్ పాయింట్‌తో విఠల్‌వాడి సినిమా తెరకెక్కింది. హీరో రోహిత్ కథకు కరక్ట్‌గా సెట్టయ్యాడు. యూత్‌ని ఎంటర్‌టైన్ చేసే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. చిన్ని సినిమాకు పెద్ద విజయంతో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత నరేష్ మాట్లాడుతూ -సహజమైన కథ, కథనాలతో సాగే సినిమా ఇది. హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తే ఫన్ లవ్ స్టోరీగా దర్శకుడు నాగేంద్ర అద్భుతంగా తెరకెక్కించాడు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సహకారంతో తెరకెక్కిన ప్రేమ కథ -ఆడియన్స్‌కి కనెక్టవుతుందనే అనుకుంటున్నా అన్నారు.