మూడో హిట్టుకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా రెండు సినిమాలిచ్చిన హీరోత్సాహంతో -మూడో ప్రాజెక్టుని మొదలుపెట్టాడు సాయితేజ్. ప్రస్థానంతో క్రిటిక్స్ అప్లాజ్ అందుకున్న దర్శకుడు దేవకట్ట తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు గురువారం లాంఛనంగా మొదలైంది. జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై జె భగవాన్, జె పుల్లారావు నిర్మిస్తోన్న చిత్రాన్ని హీరో పవన్ కల్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చి లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాతలు అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేసి దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. తొలి షాట్‌కు దర్శకుడు వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో సాయితేజ్‌తో నివేదా పేతురాజ్ రొమాన్స్ చేయనుంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీతం మణిశర్మ, సినిమాటోఫ్రీ శ్యామ్‌దత్ సమకూర్చనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు దేవకట్టా మాట్లాడుతూ -ఇదొక ఎగ్జయిటెడ్ స్టోరీ. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు.. ఇలా మంచి టీం దొరికింది. టీంకి విషెస్ అందించిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్‌కి వెళ్తున్నాం అన్నారు. కార్యక్రమంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ఎఎం రత్నం, ఎంవిఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.