ప్రేమ.. పీక్స్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాపై ఫ్యాషన్‌తో వచ్చి కష్టాలకోర్చి ప్రేమ పిపాసితో హీరో అయ్యాడు జీపీఎస్. దర్శకుడు మురళీ రామస్వామి తెరకెక్కించిన చిత్రానికి పిఎస్ రామకృష్ణ, రాహుల్ పండిట్, యుగంధర్, వైజాగ్ మురళి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంలో హీరో జీపీఎస్ మీడియాతో మాట్లాడాడు.
* చిన్నప్పటి నుంచీ సినిమాలపై ఆసక్తితప్ప, నాకు ఎలాంటి నేపథ్యం లేదు. చిరంజీవి సినిమాలు చూస్తూ మరింత ఆసక్తి పెంచుకున్నా. తేజ కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నట్టు తెలిసి హైదరాబాద్ వచ్చి ప్రయత్నించా. వర్కౌట్ కాలేదు. వేషాల కోసం ప్రయత్నిస్తూనే -దర్శకత్వం, రచనా విభాగాల్లో కొంతకాలం పని చేశాను. మధ్యలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేశాను.
* ‘నేనొస్తా’ చిత్రంలో తొలిసారి నెగెటివ్ రోల్ చేశాను. మంచి పేరు వచ్చింది. తరువాత చాలా అవకాశాలు వచ్చినా -హీరో పాత్రల కోసమే ప్రయత్నించాను.
* దర్శకుడు మురళీ రామస్వామి చాలాకాలంగా నాకు మిత్రుడు. హీరో అవ్వాలన్నది నా కోరిక అయితే, మంచి దర్శకుడు అవ్వాలన్నది ఆయన లక్ష్యం. ఒకసారి ప్రేమపిపాసి స్టోరీ చెప్పాడు, నచ్చింది. నిర్మాతను వెతుకుతున్న క్రమంలో పిఎస్ రామకృష్ణ పరిచయమయ్యారు. అలా ఆయన స్నేహితులూ అంతా కలిసి -సినిమా నిర్మిస్తున్నారు.
* ప్రేమపిపాసి స్టోరీ రెగ్యులర్ కాదు, వైవిధ్యంగా ఉంటుంది. సినిమా మొత్తం నా పాత్రచుట్టూ తిరుగుతుంది. వన్‌మాన్ ఆర్మీలా నా పాత్ర ఉంటుంది. లవ్, ఎమోషన్స్, రొమాన్స్, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఎక్స్‌ట్రీంగా ఉంటాయి. నెక్ట్స్ ఏజ్ సినిమాగా చెబుతున్నాం అందుకే. లిప్‌లాక్ అంటే కంటెంట్ లాక్‌లా ఉంటుంది తప్ప, ఏదో పెట్టాలని పెట్టలేదు.
* దర్శకుడు నా ఫ్రెండ్ కావడంతో -మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇద్దరి ఆలోచనలూ ఓకేలా ఉండటంతో -ఇద్దరికీ సింకైంది. దీంతో అవుట్‌పుట్ బాగా వచ్చింది. దర్శకుడు కొత్తగా ఆలోచిస్తూనే, వేగంగా పూర్తి చేశాడు. కథ నచ్చి నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించారు.
* తిరుమల మ్యూజిక్, ఆర్స్ సినిమాటోగ్రఫీ.. రెండూ ప్రాజెక్టుకు ప్లస్‌పాయింట్లు. పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. యూత్‌కు నచ్చేలాంటి ఎలిమెంట్స్‌తో నలుగురి హీరోయిన్ల పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి.