ఎక్కడాగిందో.. అక్కడినుంచే!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, స్వాతి జోడీగా ఆరేళ్ల క్రితం వచ్చిన ‘కార్తికేయ’ సెనే్సషన్ క్రియేట్ చేసింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన థ్రిల్లర్ -నిఖిల్ కెరీర్‌కు బూస్ట్‌లా పనిచేసింది కూడా. హిట్టు సినిమా కనుక సీక్వెల్ ఉంటుందని చాలాకాలంగా వినిపిస్తున్నా -ఆరేళ్ల తరువాత ‘కార్తికేయ 2’ ప్లాన్‌ని కన్ఫర్మ్ చేశారు. ద్వాపరియుగం నాటి జ్ఞాన భాండాగార రహస్యాన్ని కలియుగంలో వెలికితీసే కథగా -కార్తికేయ 2 థ్రిల్లర్ ఉండబోతోందన్న విషయం ఇప్పటికే అర్థమవుతోంది. కార్తికేయలో నిఖిల్‌కు జోడీగా పర్ఫెక్ట్ కెమిస్ట్రీ పండించిన స్వాతికి -సీక్వెల్‌లో చోటుంటుందా? అన్న సందేహాలు ప్రాజెక్టు ప్రకటించిన దగ్గర్నుంచీ వినిపిస్తున్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం -స్వాతికి ‘స్పెషల్ బెర్త్’ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. కార్తికేయ సీక్వెల్‌కు స్వాతికి ప్లేస్ ఉంటుందంటూ నిఖిల్ సైతం గత ఇంటర్వ్యూలో చూచాయగా చెప్పడం తెలిసిందే. కార్తికేయలో స్వాతి పాత్ర ఎక్కడ ముగిసిందో.. అక్కడినుంచే కార్తికేయ 2లో కనిపించనుందన్నది సమాచారం. అయితే, నిఖిల్‌కు జోడీగా మరో హీరోయిన్‌కు చాన్స్ ఇవ్వనున్న నేపథ్యంలో -స్వాతి పాత్ర ప్రాధాన్యతపై ఆసక్తి రేకెత్తుతోంది. పీపుల్ మీడియా ప్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై చందు మొండేటి తెరకెక్కించనున్న సీక్వెల్ స్టోరీ -వచ్చే దసరా సీజన్‌లో థియేటర్లకు రావొచ్చన్నది ఓ అంచనా.