అదీ త్రి’షయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి -కొరటాల కాంబోలో తెరకెక్కుతోన్న ఆచార్య ప్రాజెక్టు నుంచి త్రిష తప్పుకుంది. ఆమె డెసిషన్ షాకేనన్న టాక్ వినిపిస్తున్నా -ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వెనుక త్రిష అనుభవం కనిపిస్తోందన్న మాటా లేకపోలేదు. చివరి క్షణంలో త్రిష తప్పుకోవడంతో -బోర్డులోకి మరో సీనియర్ హీరోయిన్ కాజల్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది యూనిట్. అయితే, త్రిష తప్పుకోడానికి ప్రధాన కారణం -ముందుగా సోలో హీరోయిన్ అని చెప్పి ఇప్పుడు మరో హీరోయిన్‌ని కూడా తీసుకునేందుకు రెడీ కావడమేనన్న మాట వినిపించింది. సినిమాలో అతిథి ప్రాత్రగానే కనిపించినా -రామ్‌చరణ్ చేయనున్న పాత్రకూ ప్రాధాన్యత ఉంది. చరణ్‌కూ మరో హీరోయిన్‌ని ఫిక్స్ చేస్తున్నారు. ఇద్దరు మెగా హీరోలున్న చిత్రంలో మరో హీరోయిన్‌తో త్రిష స్క్రీన్ షేర్ చేసుకోవడమంటే.. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు వదులుకోవడం త్రిషకే నష్టమన్న మాట వినిపిస్తున్నా -సీనియర్ హీరోయిన్‌గా ఆమె లెక్కల్లోనూ విషయముందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. నిజానికి టాలీవుడ్‌లో త్రిష పేడౌటై చాలా కాలమైంది. చిన్న హీరోల పక్కన త్రిషను తీసుకుని బ్యాలెన్స్ చేయడం కష్టం కనుక -ఆ కోణంలోనూ ఆఫర్లు రావడం లేదు. అలాగని త్రిష ఖాళీగా లేదు. తమిళంలో ఆమె క్రేజీ ప్రాజెక్టులే చేస్తోంది. పైగా, చిరు సినమా అయినా, చిన్న హీరో సినిమా అయినా ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర చేయడంవల్ల తన కెరీర్‌కు కలిసొచ్చే విషయం ఏమీ లేదన్న లెక్కలు వేసుకుందట త్రిష. ఆమె కెరీర్ ఇమేజ్‌కు తగిన స్థాయి పారితోషికం కూడా ఆఫర్ చేయలేదన్న మాటా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం మిగిలిన ప్రాజెక్టుల్ని డిస్ట్రర్బ్ చేయడం ఇష్టంలేక త్రిష -చిరుతో ఆఫర్‌ను వదులుకుందని అంటున్నారు. ప్రాధాన్యత లేని పాత్ర చేసి ఉన్న కెరీర్‌ను పొగొట్టుకునేకంటే -సోలో హీరోయిన్ సినిమాలు వచ్చినపుడే చేయడం బెటరన్న ఆలోచనలో త్రిష ఉందని అంటున్నారు. ఇదిలావుంటే, కాజల్‌కు కూడా భారీ పారితోషికం ఇచ్చేందుకు యూనిట్ ఆసక్తి చూపకపోవడంతో -ఆచార్య బోర్డులోకి వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్థంలో కాజల్ సైతం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే -త్రిష పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టే.