సాబ్‌కు జోడీగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద ఛాన్స్‌ల కోసం గ్లామర్ ఫొటోషూట్లకు దిగిన అందాల రాక్షసికి -ఆశించిన అవకాశం దొరికినట్టే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌తో జోడీకట్టే చాన్స్ లావణ్యకు దాదాపు ఓకే అయ్యిందట. నిఖిల్‌తో చేసిన ‘అర్జున్ సురవరం’ తన కెరీర్‌కు కలిసొస్తుందనుకుంటే, సినిమా ఒకే అనిపించుకుందే తప్ప లావణ్యకు చాన్స్‌లు తేలేకపోయింది. దాంతో లావణ్య వరుస ఫొటోషూట్లతో ఈమధ్య హడావుడి చేసింది. ఆమె ప్రయత్నాలు ఫలించి -తమిళంలో అధర్వతో జోడీకట్టే అవకాశం అందితే, తెలుగులో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా పవన్‌కు జోడీగా చాన్స్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. రీఎంట్రీగా పవన్ చేస్తున్న పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో అంజలి, నివేదా థామస్ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితురాళ్లుగా కనిపించనున్నారు. అయితే హీరో పవన్‌ను దృష్టిలో పెట్టుకుని -ఈ ప్రాజెక్టుకు కమర్షియల్ టచ్ ఇస్తున్నారు. పవన్ ఫ్లాష్‌బ్యాక్‌గా డిజైన్ చేసిన ఈ ఎపిసోడ్‌లో ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారట. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా శృతిహాసన్‌ని ఎంపిక చేసుకున్నట్టు కథనాలొచ్చాయి. మరో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని సంప్రదించారని తెలుస్తోంది. పవన్‌కు జోడీ కనుక లావణ్య ఎట్టిపరిస్థితుల్లో నో చెప్పదు. సో, దిల్ రాజు ప్రాజెక్టులో లావణ్యకు బెర్త్ దొరికేసినట్టే. పవన్‌తో చాన్స్ తరువాత -పెద్ద హీరోలూ లావణ్యను కన్సిడర్ చేస్తారేమో.