ఆగనంటున్న నిఖిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే -ఈ కరోనా గొడవేంటో.. అంటూ పాపం ఇద్దరు యంగ్ హీరోల ప్యాన్స్ తెగబాధ పడుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ నితిన్, నిఖిల్ పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. నితిన్ ఇప్పటికే శైలజా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. నిఖిల్ సైతం తన లవ్ పల్లవి వర్మను లైఫ్‌లోకి ఆహ్వానించేందుకు రెడీ అయ్యాడు. పెళ్లిళ్లకు ముహూర్తాలు సైతం ఫిక్సైపోయాయి. లైఫ్‌లో అద్భుతమైన క్షణాల కోసం సిద్ధం చేసుకున్న ప్రణాళికలన్నీ -కరోనా దెబ్బకు ఒక్కసారిగా మారిపోయినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి నితిన్-శైలజారెడ్డి పెళ్లికి ముహూర్తం ఏప్రిల్ 15గా ఫిక్స్ చేసుకున్నారు. అదీ దుబాయ్‌లో గ్రాండ్‌గా పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక నిఖిల్ హైదరాబాద్‌లోనే ఏప్రిల్ 16న పల్లవి వర్మతో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు. కరోనా ఇంపాక్ట్‌తో పెళ్లిళ్లు వాయిదా పడే అవకాశముందంటూ కథనాలు వస్తున్నా నేపథ్యంలో -నిఖిల్ తాజాగా క్లారిటీ ఇచ్చేశాడు. తన పెళ్లిని వాయిదా వేసుకునే ఆలోచన లేదని, అయితే కరోనా ఇంపాక్ట్ కారణంగా ఆహ్వానితులను తగ్గించి సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్నట్టు చెప్పేశాడు. నితిన్ పెళ్లి విషయంలోనూ -కుటుంబీకులు క్లారిటీ ఇస్తున్నారు. పెళ్లి వాయిదా పడిందంటూ వస్తోన్న కథనాలు నమ్మొద్దని, ఇంకా చాలా టైం ఉన్న కారణంగా ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంలో ఊహాగానాలను ప్రచారం చేయొద్దంటూ కోరుతున్నట్టు తెలుస్తోంది.