వక్కంతం కథకు రవితేజ ఓకే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ సినిమా నా పేర సూర్యతో రచయిత నుంచి దర్శకుడయ్యాడు వక్కంతం వంశీ. అనుభవజ్ఞడైన కథా రచయిత -అనుభవలేమితో దర్శకత్వం వహిస్తే సినిమా ఎలా ఉంటుందో బాక్సాఫీస్‌కు ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యిందది. ఆ సినిమా తరువాత మళ్లీ సినిమా మొదలు పెట్టడానికి బన్నీ చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అటు దర్శకుడైన వక్కంతం వంశీ క్రెడిబిలిటీ కూడా పూర్తిగా దెబ్బతింది. సెకెండ్ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రిపరేషన్‌కు ఎక్కువ టైం తీసుకున్న వక్కంతం -ఓ మాసీ సబ్జెక్టు ప్రిపేర్ చేసి రవితేజకు వినిపించాడట. వరుస ఫ్లాపులను రుచి చూస్తున్న రవితేజ సైతం -తన బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే సరైన కథ కోసం చూస్తున్నాడు. ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోన్న క్రాక్ షూటింగ్‌తో బిజీగావున్న రవితేజ -వంశీ నెరేట్ చేసిన కథపై పాజిటివ్‌గా ఉన్నాడన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో చేస్తున్న క్రాక్ పూర్తికాగానే, యాక్షన్ థ్రిల్లర్ రాక్షసుడుతో హిట్టుకొట్టిన దర్శకుడు రమేష్ వర్మకు రవితేజ కమిటై ఉన్నాడు. వక్కంతం చెప్పిన కథ రవితేజకు నచ్చింది కనుక -టీం సెట్టయితే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదంటున్నారు. సో, రమేష్‌వర్మతో ప్రాజెక్టు తరువాత వక్కంతం ప్రాజెక్టుతో రవితేజ ముందుకెళ్తాడన్న మాట.