సీన్‌లోకి స్వీటీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచార్యకు జోడీగా ఎవరు ఫైనలవుతారోగానీ, రెండు రోజులకో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. చిరుకు జోడీ కనుక -దర్శకుడు కొరటాల శివ ఎవరో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం లేదు. పైగా సొంత బ్యానర్‌పై నిర్మితమవుతోన్న చిత్రం కనుక -చాలా ఈక్వెషన్స్ సాల్వ్ కావాల్సి ఉంటుంది. అందుకే -హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం చాలా కసరత్తే చేస్తోంది. ముందుగా త్రిషను ఎంపిక చేసుకున్నా -చివరి క్షణంలో ఆమె ప్రాజెక్టునుంచి తప్పుకుంది. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె జాగ్రత్త పడటంతో -ఫేడౌటైన సీనియర్ హీరోయిన్ కాజల్‌కు బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందనుకున్నారు. చిరు రీఎంట్రీ తొలి సినిమాలో జోడీకట్టి మంచి కెమిస్ట్రీ చూపించిన కాజల్ ఫైనల్ అనుకున్నారు. అన్ని మీడియా మాధ్యమాల్లో ఆమె పేరు వైరలైంది. చందమామ పేరు వినిపించి రెండు రోజులు కాకముందే -ఇప్పుడు సీన్‌లో స్వీటీ పేరు వినిపిస్తోంది. చిరుకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుష్కేనని దర్శకుడు ఫీలవుతున్నాడట. పైగా జోడీగా వీళ్లిద్దరిదీ ఫస్ట్ కాంబినేషన్ కనుక ప్రాజెక్టు ఇమేజ్ పెరుగుతుందన్న లెక్కలూ వేస్తున్నారట. ప్రాజెక్టులో స్పెషల్ రోల్‌లో కనిపించనున్న రామ్‌చరణ్‌కు జోడీగా ఓ యంగ్ బ్యూటీని ఎలాగూ తీసుకుంటారు కనుక.. చిరు-అనుష్క జోడీ పర్ఫెక్ట్ అవుతుందని చిత్రబృందం భావిస్తోందట. స్వీటీ ఫైనలో, మళ్లీ మారుతోందో తెలియాలంటే -అధికారిక ప్రకటన వెలువడే వరకూ ఎదురు చూడాల్సిందే.