టార్గెట్ బాలీవుడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల వైకుంఠపురములో -సినిమాతో పూజాహెగ్దె స్టార్‌డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా హిట్లందుకుంటున్న క్రమంలో -ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్టందుకున్న చిత్రంతో పూజ టాప్ హీరోయిన్ స్టేటస్‌కు రీచైంది. చేతిలో టాలీవుడ్ హీరోల సినిమాలున్నా -బాలీవుడ్‌లో తన ప్రతాపం చూపించాలన్న చిరకాల కోరిపై పూజ మరోసారి ఫోకస్ పెడుతోందన్న మాట వినిపిస్తోంది. బాలీవుడ్‌లో స్టార్‌డమ్ కోసం పర్ఫెక్ట్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. కెరీర్ ఆరంభంలోనే బాలీవుడ్ చాన్స్‌లపై ఆసక్తి చూపిన పూజపై -మొహెంజదారో చిత్రంతో ఐరెన్‌లెగ్ ముద్ర వేసేశారు. ఈ ముద్ర చెరిపేసుకుని -బాలీవుడ్‌లో రాణించే యోచనతో పూజ ఉందట. ప్రస్తుతం ప్రభాస్ 20వ ప్రాజెక్టు జాన్‌లో పాన్ ఇండియా హీరోతో రొమాన్స్ చేస్తోంది పూజ. దర్శకుడు త్రివిక్రమ్‌కు కలిసొచ్చిన హీరోయిన్‌గా -ఎన్టీఆర్‌తో చేయబోయే ప్రాజెక్టులోనూ బెర్త్ సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్‌డమ్ కోసం -స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌తో ‘బచ్చన్ పాండి’కి ఓకే చెప్పింది పూజ. ఈ ప్రాజెక్టులో కృతిసనన్ సైతం లీడ్‌రోల్ చేస్తున్నా.. పూజ తన రోల్‌పై పూర్తి నమ్మకంతో ఉందట. ప్రస్తుతం బాలీవుడ్‌లో అక్షయ్ హవా ఓ రేంజ్‌లో ఉంది. అలాంటి అక్షయ్‌తో కెమిస్ట్రీని పండించగలిగితే -పూజకు తిరుగుండదు. ఒక్క సినిమా చాలు స్టార్‌ని మార్చేయడానికన్న ధైర్యం కోసం -అల.. వైకుంఠపురములో సినిమా ఎలానూ ఉండనే ఉంది. బాలీవుడ్‌లోనూ పూజ గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందేమో చూద్దాం.