పాపన్న-2 వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైహింద్ పిక్చర్స్ పతాకంపై బాలనరసింహ గౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న-2’. కథానాయకుడిగా జైహింద్ గౌడ్ నటిస్తున్నారు. గతంలో కృష్ణ, సుమన్ ముఖ్యపాత్రల్లో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రాన్ని రూపొందించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగా తొలి చిత్రంలో నటించిన జైహింద్ గౌడ్ ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జైహింద్ గౌడ్ మాట్లాడుతూ- గతంలో చేసిన సినిమా విజయవంతం అయిందని, ఆ చిత్రంలో పాపన్న చరిత్రను మొత్తం చూపలేకపోవడంవల్ల ఈ రెండో చిత్రంలో చెబుతున్నామని, మొత్తం ఐదు భాగాలుగా తీసినా ఆయన జీవిత చరిత్ర మొత్తం చూపలేమని ఆయన తెలిపారు. పేద, నిమ్న కుల వృత్తులవారిని ఐక్యం చేసి జమీందారి, నవాబు వ్యవస్థలతో తిరుగుబాటుచేసిన పాపన్న పాత్రలో తాను నటిస్తుండడం ఆనందాన్నిస్తోందని ఆయన అన్నారు. 350 సంవత్సరాల క్రితం జరిగిన యధార్థగాధ తొలి చిత్రానికి తాను దర్శకత్వం వహించానని, ఇప్పుడు కూడా ఈ నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆనందంగా వుందని, త్వరలో నటీనటుల వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని రామకృష్ణగౌడ్ అన్నారు. వందల ఏళ్ళ క్రితమే జమీందారి వ్యవస్థపై తిరుగుబాటుచేసి గోల్కొండ కోటను సైతం తన వశం చేసుకొని ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని అక్కడ నిర్మించిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర అందరూ తెలుసుకోతగిందని, ఆయన జీవిత చరిత్రతో సినిమా రావడం ఆనందంగా వుందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. పాపన్న తండ్రిగా తొలి చిత్రంలో తాను నటించానని, మళ్లీ ఈ చిత్రంలో కూడా ఓ పాత్రలో నటిస్తున్నానని నటుడు సుమన్ అన్నారు. కార్యక్రమంలో బాల నర్సింహగౌడ్ చిత్ర విశేషాలను తెలిపారు.