ఇది అనుబంధాల బ్రెహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబంలో పెద్దవారికి గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం. అటువంటి మంచి కథనంతో సందేశాత్మకంగా బ్రహ్మోత్సవం చిత్రం రూపొందిందని కథానాయకుడు మహేశ్‌బాబు చెబుతున్నారు. పివిపి పతాకంపై మహేశ్‌బాబు, కాజల్, ప్రణీత, సమంత ప్రధాన తారాగణంగా శ్రీకాంత అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన బ్రహ్మోత్సవం ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు...

బ్రహ్మోత్సవం ఎలా ఉంటుంది?
-మన కుటుంబాలలో జరిగే అంశాలతో పండుగ వాతావరణంలో, ఫ్యామిలీ ఎమోషన్‌లతో సినిమా సాగుతుంది. శ్రీమంతుడు చిత్రం తరువాత విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంకోసం యూనిట్ అతా కష్టపడి పనిచేశాం. ఓ మంచి అందమైన సినిమాను చూశామన్న ఆనందం ప్రేక్షకులు అందిస్తాం.
దర్శకుడు శ్రీకాంత్‌తో ఎలా పనిచేశారు?
-‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ నుంచి ఆయన దర్శకత్వంలో చేస్తున్నాను. ఆయనతో పనిచేయడం చాలా సంతోషం కలిగిస్తోంది. ముఖ్యంగా ఆయన రాసే కథే ప్రధానంగా ఉండే చిత్రాల్లో చేయడం నాకిష్టం. అయితే ఆ సినిమాకు, దీనికీ కథలో ఎటువంటి సంబంధం ఉండదు. ప్రతివారికీ కుటుంబంలో ఆత్మీయుల అనుబంధం అవసరమైన ఆక్సిజన్ అందిస్తుందన్న పాయింట్‌తో ఈ చిత్రాన్ని అందించారు. గతంలో నేను చేసిన అర్జున్ చిత్రం కూడా కుటుంబ కథా చిత్రమే అయినా అది చెల్లెలి సెంటిమెంట్‌తో సాగుతుంది. ఈ చిత్రం పూర్తిగా మానవసంబంధాల నేపథ్యంలో ఆకట్టుకుంటుంది.
ఇందులో సందేశం ఏమిటి?
-ప్రతి మనిషి తన జీవితంతో అనుబంధాల నేపథ్యంలో ఆనందాన్ని పొందాలని ఈ చిత్రం చెబుతుంది. ప్రస్తుత సమాజంలో మనుషులు యంత్రాల్లా మారి, వేగంగా వెళ్లిపోతున్నారు. అలాకాదు. మనిషి జీవితంలో చాలా ఆనందం ఉందని చెబుతూ అనుబంధాలను, ఆత్మీయతను పెంపొందించాలని ఇందులో చెబుతున్నాం.
నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి?
-పివిపి సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. నిర్మాత తాను నమ్మినదానిని రిస్క్ చేసి చిత్రీకరించారు. ఇలాంటి నిర్మాతలు ఉంటే మంచి సినిమాలు వస్తాయి.
ముగ్గురు హీరోయిన్లతో ఎలా?
-ముగ్గురు కథానాయికలు ఉన్నా ఎవరికి తగిన పాత్ర వారికి ఉంది. ఇది ప్యూర్ లవ్‌స్టోరీగా సాగుతుంది కనుక సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ ముగ్గురి పాత్రలు విభిన్నంగా ఉంటాయి.
సీనియర్ నరేష్‌తో తొలిసారి నటించినట్లున్నారు!
-ఆయనతో చేయడం చాలా జోవియల్‌గా, ఆనందంగా ఉంటుంది. ఎన్నోసార్లు కలసి చేద్దామనుకున్నాం. కానీ ఇప్పుడు కుదిరింది.
టైటిల్‌లో పాదాలు కన్పిస్తున్నాయెందుకు?
-తండ్రి పాదాలకు చెప్పులు తొడిగే స్టిల్ వచ్చిందికదా!. అలా తండ్రిని దైవసమానంగా భావించడం, వినయానికి గుర్తుగా ఆ పాదాలు అక్కడ చూపించారు.
అభిమానులకు ఏం చెబుతారు?
-ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. పరిశ్రమకు వచ్చి పదహారు సంవత్సరాల తరువాత ఓ మంచిచిత్రం చేశానని నమ్ముతున్నాను.
తరువాతి చిత్రాలు?
మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తా. దానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో దీనిని రూపొందిస్తారు.

-శ్రీ