పోస్ట్ ప్రొడక్షన్‌లో 4జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సాయిలక్ష్మీ మూవీస్ పతాకంపై ఉదయ్, చంద్రకళ, సన్ని, సునంద ప్రధాన తారాగణంగా శ్రీనివాస్ కరణం దర్శకత్వంలో కె.వి.వినోద్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘4జి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. బెంగుళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ప్రేమలో ఉన్న నలుగురు ఆ ప్రేమతో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు? చివరికి ఎటువంటి పరిణామాలకు వారి జీవితం దారితీసింది? అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. సమాజంలో చాలామంది యువతీ యువకుల జీవితాలకు దగ్గరగా వుండే కథ ఇదని, వైజాగ్, అరకు తదితర ప్రాంతాల్లో సినిమాను షూటింగ్ చేశామని నిర్మాత వినోద్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ఆడియోను, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఎఫ్‌ఎం బాబాయ్, సన, కరుణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సోమన్, సంగీతం: సుక్కు, ఎడిటింగ్: శ్రీ గుహ, నిర్మాత: కె.వినోద్‌రెడ్డి, దర్శకత్వం: శ్రీనివాస్ కరణం.