సిద్ధవౌతున్న షీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పర్సరమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు రూపొందిస్తున్న ‘షీ’ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తిచేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత తేజేశ్వరరావు మాట్లాడుతూ ఈ చిత్రంకోసం తెరవెనుక కథానాయకుల ఎంపిక పూర్తిచేశామని, ఈనెలలోనే చిత్రాన్ని ప్రారంభించి ఫిబ్రవరి నెలలో పూర్తిచేసి, ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దర్శకుడు మంచి కథా కథనంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు చక్కగా కుదిరారని, భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందిస్తున్నామని అన్నారు. ఓ అందమైన ప్రేమకథకు హారర్ జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభ ఉన్న సాంకేతిక నిపుణులు దొరికారని, అన్ని హంగులతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు రమేష్ మహేంద్ర తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలె, కెమెరా: అనిత్, ఫైట్స్: సతీష్, డాన్స్: ఎర్రోళ్ల రమేష్, సహ నిర్మాతలు: గట్టు విజయ్‌గౌడ్, బసంత్‌రెడ్డి, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వరరావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పర్స రమేష్‌మహేంద్ర.