మంచి సినిమాలకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘రైట్ రైట్’ సినిమా కూడా ఆకోవలోనే ఉందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు సీడిని ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కు అందించారు. అనంతరం దాసరి నారాయణరావు మాట్లాడుతూ- సినిమాలో పాటలు ముందే విన్నానని, ఈ మధ్యకాలంలో ఇంత మెలోడియస్ మ్యూజిక్‌తో వున్న సినిమాలు రాలేదని ఖచ్చితంగా ఈ సినిమా పాటలు సక్సెస్ అవుతాయని అన్నారు. సుమంత్ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడని, హీరోకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్ తనలో వుందని, డాన్స్ అద్భుతంగా చేస్తున్నాడని అన్నారు. సినిమాలో సుమంత్‌తోపాటు ప్రభాకర్ కూడా బాగా నటించాడని అన్నారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, మంచి టెక్నీషియన్స్‌తో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ‘క్షణం’,‘ఊపిరి’ వంటి కానె్సప్ట్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అలానే కొత్త కానె్సప్టుతో వస్తోన్న మా సినిమాను కూడా ప్రేక్షులు ఆదరిస్తారని భావిస్తున్నానని చెప్పారు. దర్శకుడు మను మాట్లాడుతూ, డ్రైవర్‌కు కండక్టర్‌కు మధ్య జరిగే కథ ఈ సినిమా అని అన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ సినిమాలో సుమంత్‌కు, తనకు మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ, సుమంత్‌తో మా బ్యానర్‌లో ‘కేరింత’ సినిమా తీసి హిట్ కొట్టామని, ఈ సినిమాతో తనకు మరొక పెద్ద హిట్ రావాలి అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బి.గోపాల్, సీనియర్ నరేష్, కోదండరామిరెడ్డి, చంటి, సాయికిరణ్ అడివి పాల్గొన్నారు.