సిద్ధమైన అంపశయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైన నవలగా నవీన్ రచించిన ‘అంపశయ్య’ పేరుగాంచింది. 1969లో రాసిన ‘అంపశయ్య’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే పాఠకులను అలరిస్తోంది. ఈ నవలను జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవరాయ ఫిలిమ్స్ పతాకంపై ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ రూపొందించారు. శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, నరసాపూర్ అడవి, వరంగల్ రామప్పగుడి, ఉస్మానియా యూనివర్సిటీల్లో షూటింగ్ చేశామని, ఈ చిత్రానికి ‘క్యాంపస్- అంపశయ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశామని తెలిపారు. ఈ నవలను తెరకెక్కించాలని మూడేళ్ళుగా అనుకున్నామని, క్యాంపస్‌లో షూటింగ్ చేసిన తొలి చిత్రం ఇదేనని ఆయన తెలిపారు. ఓ గ్రామం నుండి యూనివర్సిటీకి చదువుకోడానికి వచ్చిన యువకుని జీవితంలో ఒక రోజు ఉదయం నుండి రాత్రివరకు ఎదురయ్యే సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.