ప్రయోగాలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న తమన్నా ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో బిజీగా వుంది. ఇప్పటికే తమిళ తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘అభినేత్రి’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ‘బాహుబలి-2’ చిత్రంలో కూడా నటిస్తోన్న ఈమెకు ‘బాహుబలి’ మొదటి భాగం లో విపరీతమైన క్రేజ్ దక్కింది.‘ఊపిరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమన్నాకు ‘బాహుబలి’ సినిమా తరువాత తన ఆలోచనలన్నీ మారిపోయాయని చెబుతోంది. ఈ విషయంపై స్పందిస్తూ ఇంతకుముందు ప్రయోగాత్మక కథలంటే దూరంగా వుండేదాన్ని. కానీ ‘బాహుబలి’ సినిమా తరువాత నా ఆలోచనలన్నీ మారిపోయాయి. విభిన్నమైన పాత్రలు చేస్తే ప్రేక్షకుల స్పందన ఎలా వుంటుందో అర్థమైంది. అందుకే ఇకపై కొత్త తరహా పాత్రలే చేస్తానని చెబుతోంది.