ప్రారంభమైన అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సాయి సినిమాస్ పతాకంపై సత్యనారాయణ సజ్జనపు దర్శకత్వంలో సాయి నాగుల్‌మీరా నిర్మిస్తున్న చిత్రం ‘అనుబంధం’ (శాటిలైట్‌తో). ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీశ్రీ శివరామచైతన్యం విచ్చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ నేటి యువతరంలోని అనుబంధాలను శాటిలైట్‌తో వాటి సంబంధాలను కొత్తదనంతో చూపించే వైవిధ్యభరిత చిత్రమే ఇదని తెలిపారు. కథ నచ్చడంతో ఈ సినిమా రూపొందించడానికి నిర్మాత ముందుకు వచ్చారని, అందర్నీ ఆకట్టుకునే అంశాలు ఉంటాయని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో భారీ బడ్జెట్‌తోనైనా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చానని, సినిమాలో నటించే హీరో హీరోయిన్లు మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోందని, త్వరలో ప్రకటిస్తామని నిర్మాత అన్నారు. ఈనెల 20నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నామని ఆయన అన్నారు.