మగరాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, శ్రీదివ్య జంటగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని హరి వెంకటేశ్వర పతాకంపై తెలుగులో జి.హరి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని అందిస్తుందని, దర్శకుడు ముత్తయ్య ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించారని, విశాల్ గెటప్ గత సినిమాలకన్నా భిన్నంగా వుంటుందని తెలిపారు. క్లాస్, మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయని, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు, ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాధారవి, సూరి, ఆర్.కె.సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వేల్‌రాజ్, సంగీతం:బి.ఇమాన్, ఎడిటింగ్:ప్రవీణ్, సమర్పణ:విశాల్, నిర్మాత:హరి, దర్శకత్వం:ముత్తయ్య.