అలాంటి పాత్రలొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంకర్‌గా తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని తెచ్చుకున్న అనసూయకు ‘జబర్దస్త్’ ప్రోగ్రాం స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దాంతో మరోవైపు సినిమాల్లో కూడా అవకాశాలు క్యూకట్టాయి. నాగార్జునతో నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘క్షణం’ సినిమాలతో అనసూయ మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల తరువాత ఈమెకు మరిన్ని సినిమాలు వస్తాయని అనుకున్నారందరూ. కానీ, ఇప్పటివరకూ అనసూయ ఏ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. దానికి కారణం, ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేయాలంటూ, గ్లామర్ పాత్రల్లో నటించాలంటూ అవకాశాలు వస్తున్నాయట. అందుకే నో గ్లామర్ అంటూ ఈ సినిమాలను ఒప్పుకోవడంలేదు. తనదైన చలాకీతనంతో గ్లామరస్ ఇమేజ్ తెచ్చుకున్న అనసూయ ఇలా గ్లామర్ పాత్రల్లో నటించననడం విశేషం. అయితే, పెద్ద బ్యానర్లలో, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే చేస్తానని చెబుతోందట.

చిత్రం అనసూయ