లక్ష్మిబాంబ్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో గోపాలకృష్ణ దర్శకత్వంలో గుణపాటి సురేష్‌రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందే చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వేళ్ల వౌనికా చంద్రశేఖర్, ఉమాలక్ష్మీనరసింహ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి హీరో మంచు విష్ణు క్లాప్‌నివ్వగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ, నటిగా ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు భిన్నంగా పవర్‌ఫుల్ జడ్జి పాత్రలో కన్పిస్తానని అన్నారు. గోపాలకృష్ణ కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో లక్ష్మి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని, ఈ సినిమాకు లక్ష్మి బాంబ్ అనే టైటిల్‌ను పెట్టామని, వచ్చే నెలనుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తామని అన్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తారని అన్నారు. సునీల్ కశ్యప్ మాట్లాడుతూ, ఈ సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు:డార్లింగ్ స్వామి, ఆర్ట్:రఘు కులకర్ణి, సంగీతం:సునీల్ కశ్యప్, కెమెరా:అంజి, నిర్మాతలు:వౌనికా చంద్రశేఖర్, ఉమాలక్ష్మీ నరసింహ, దర్శకత్వం:కార్తికేయ గోపాలకృష్ణ.