రిలీజ్ డేట్ మార్చడంవల్లే కలిసొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బెంగాల్ టైగర్ చిత్రం అక్టోబర్‌లోనే విడుదలకు సిద్ధమైంది. కానీ ఒకేసారి అన్ని చిత్రాలు విడుదల కావడం పరిశ్రమకు మంచిది కాదు. అది నిర్మాతలకు నష్టం కూడా. అది ఇష్టంలేక డిసెంబర్‌లో విడుదల చేశాం. ఇప్పుడు అది కలిసొచ్చింది’ అని చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ చెబుతున్నారు. రవితేజ, తమన్నా, రాశిఖన్నా ప్రధాన తారాగణంగా సంపత్‌నంది దర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘బెంగాల్ టైగర్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కేంద్రాలలో కలక్షన్లు ఆశావహంగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
దర్శకుడికి హ్యాట్రిక్ చిత్రం ఇచ్చినట్టున్నారు?
మొన్న పదో తారీఖున రెండు రాష్ట్రాల్లో విడుదలైన బెంగాల్ టైగర్ చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా మంచి స్పందన లభిస్తోంది. సంపత్‌నంది, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అలాగే రవితేజ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాస్ కలక్షన్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రతి రోజు హౌస్‌ఫుల్ కలక్షన్లతో సాగుతోంది. ఈ చిత్రంతో సంపత్‌నందికి హ్యాట్రిక్ లభించినట్లయింది.
కిక్-2 ప్రభావం పడలేదా?
అలా అని చెప్పలేను. భారీ అంచనాలతో ‘కిక్-2’ చిత్రం విడుదలైనా ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. ఆ సినిమా కనుక హిట్ అయితే మా చిత్రానికి మరికొంత లాభదాయకంగా మారేది. ఆ సినిమా ప్రభావం మా చిత్రం వ్యాపారంపై పడింది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు తక్కువ రేట్లకే తీసుకున్నారు.
బడ్జెట్‌ను ఎలా కేటాయిస్తారు?
ఏదైనా సరే సినిమాలో కథను బట్టి బడ్జెట్‌ను నిర్ణయిస్తాం. ఈ చిత్రంకోసం భారీగా ఎందుకు ఖర్చుపెడుతున్నారని పలువురు నన్నడిగారు. కానీ నేను కథకోసమే ఖర్చుచేస్తున్నానని చెప్పాను. నా దృష్టిలో పెద్ద సినిమా చిన్న సినిమా అని ఎక్కడా వుండదు. కథ బావుంటే అదే మంచి సినిమా. అందుకే అనుభవంకోసం చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా నేను చేశాను.
ఇప్పటి ట్రెండ్‌లో కథ ప్రాముఖ్యత ఎంత?
కథే సినిమాకు ప్రధానమైన అంశం. ప్రేక్షకుల ఆలోచనా తీరుని గమనిస్తూ వారికి నచ్చిన కథల్నే ఎన్నుకోవాలి. నేను అలాగే చేస్తాను. ఫ్యామిలీ, కామెడీ, యూత్, రొమాన్స్ లాంటి అన్నీ అంశాలు ఆ కథలో ఉండాలి. చిత్రంలో స్క్రీన్‌ప్లే అనేది కూడా ప్రధానం. అయితే బెంగాల్ టైగర్‌లో స్క్రీన్‌ప్లే సరికొత్తగా ఉంటుంది. అది చిత్ర విజయానికి ప్లస్ అయింది.
సక్సెస్ రేటు తక్కువైనప్పుడు ఎలా?
సినిమా అంటేనే పూర్తి రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఏ సినిమా సక్సెస్ రేటు అయినా చాలా తక్కువ అనే చెప్పాలి. సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో నిర్మాత చిత్రాన్ని నిర్మిస్తాడు. దానిమీద భారీ పెట్టుబడులు పెట్టడమనేది నిజంగా రిస్కే. అలాంటి రిస్క్ చేయగలను కాబట్టే ఈ చిత్రాన్ని చేశాను. దానికి తోడు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాను. సినిమా మొదలుపెట్టినప్పుడు పెడుతున్న పెట్టుబడి మళ్లీ తిరిగి వస్తుందన్న నమ్మకంతో పెట్టను. అలా రిస్క్ తీసుకుని చిత్రాలు చేస్తాను.

- శ్రీ