చెకోరి చెకోరీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల మేకింగ్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. మూడో పాటగా ఇప్పుడు చెకోరిని 26న సోషల్ మీడియాలో దర్శకుడు విడుదల చేయనున్నారు. అదేరోజు నాగచైతన్య, కోనవెంకట్ ట్విట్టర్‌లో విడుదల చేస్తారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ, నాగచైతన్య, గౌతమ్ మీనన్, ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్‌లో వస్తున్న మరో మ్యూజికల్ హిట్ చిత్రం ఇదని, వైజాగ్‌నుండి కన్యాకుమారివరకూ హీరో హీరోయిన్ బైక్‌పై ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చే ఈ పాట సినిమాకు హైలెట్ అవుతుందని తెలిపారు. ఈ సినిమాలో నాగచైతన్య లుక్ డిఫరెంట్‌గా వుండనుందని, మరో మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందని దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెలిపారు. యూట్యూబ్‌లో నాలుగు మిలియన్లకుపైగా తొలి పాటలకు వ్యూస్ వచ్చాయని, మూడో పాట కూడా అందరికీ నచ్చుతుందని నిర్మాత తెలిపారు. మంజిమ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఎ.ఆర్.రెహమాన్, కెమెరా:డాన్ మాక్ ఆర్డర్, ఎడిటింగ్:ఆంటోని, నిర్మాత:మిర్యాల రవీందర్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.