అభినేత్రి ఫస్ట్‌లుక్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతోన్న తమన్నా, తాజాగా ‘ఊపిరి’తో సూపర్‌హిట్ కొట్టి తన స్థాయిని మరింత పెంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా ‘అభినేత్రి’ అనే ఓ లేడీ ఓరియంటెడ్ హారర్ సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రభుదేవా నిర్మిస్తుండగా, తెలుగు వర్షన్‌కు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న ఏ.ఎల్.విజయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక జూన్ 3న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది. సోనూసూధ్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై తమన్నా చాలా ఆశలే పెట్టుకుంది.