లాస్‌ఏంజిలిస్‌లో శభాష్‌నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడిగా బ్రాండ్ తెచ్చుకున్న కమల్‌హాసన్.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటిచెప్పుకున్నారు. తాజాగా ఆయన తన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శభాష్‌నాయుడు అనే సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రఖ్యాత మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమైంది. ఫస్ట్ షెడ్యూల్‌ను అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో పూర్తిచేయనున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకుని టీమ్, పక్కా స్క్రిప్ట్‌తో నేడు లాస్‌ఏంజిల్స్ చేరుకుంది. తెలుగు పాపులర్ కమెడియన్ బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్, కమల్ కూతురుగా మరో కీలక పాత్రలో నటించనున్నారు. శ్రుతిహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ కూడా ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.