6 నుండి చిరు సినిమా షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు రంగం సిద్ధం అయిపోయింది. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తిచేసుకుంది. జూన్ 6న సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నట్లు టీమ్ ప్రకటించింది. మాస్ దర్శకుడు వీవీ వినాయక్ చిరంజీవి స్థాయికి సరిపడేలా అన్ని హంగులతో, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కోసం చిరంజీవి ఇమేజ్‌కు సరిపడేలా కథలో మార్పులు చేశారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో చిరు సరసన అనుష్క హీరోయిన్‌గా నటించనుంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది.