10న రానున్న దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరజ్ శ్యామ్, నేహా సక్సేనా, సాయికుమార్ ప్రధాన తారాగణంగా యశస్విని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంగమూరి శేషగిరిరావు రూపొందించిన చిత్రం ‘దండు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి తొలికాపీని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ- కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలను కలగలిపి రూపొందించిన ఈ చిత్రం కన్నడంలో పెద్ద హిట్ అయిందని, తెలుగులో కూడా అంతే విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. రెండున్నర సంవత్సరాలపాటు ఈ చిత్రం కోసం పనిచేశామని, 1970 నుండి 1996 వరకూ ఆదోనిలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించామని, ప్రతి ఒక్కరికీ నచ్చే అంశాలతో రూపొందిన దండు తప్పక విజయవంతం అవుతుందన్నారు.