బొద్దుగా.. ముద్దుగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా భామ ఇలియానా ఆమధ్య బాగా సన్నబడింది. అదేదో జీరో సైజ్ కోసమేనట. అసలే సన్నగా నాజూకుగా వుండే ఈ భామ ఇంకా సన్నబడడంతో చూసినవారు పెదవి విరిచారు. టాలీవుడ్‌ను కాదని బాలీవుడ్ చెక్కేసిన ఇలియానా, అక్కడ వెలగబెట్టింది పెద్దగా ఏమీ లేదు. ఈ ఐదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేసింది. అవి కూడా హిట్ కాలేదు. దాంతో తన క్రేజ్ తుస్సుమంది. ఇప్పుడు చేతిలో కేవలం రుస్తుం చిత్రం మాత్రమే వుంది.
దాంతో లాభం లేదనుకున్న ఇలియానా ఇప్పుడు మళ్లీ బరువు పెంచే ప్రయత్నంలో వుంది. పాత గ్లామర్‌ను సొంతం చేసుకునే ప్రయత్నంలో విజయవంతమైంది. దీన్నిబట్టి చూస్తే మళ్లీ టాలీవుడ్‌లోకి రావడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఇటీవలే బాలయ్య సినిమా కోసం కూడా ప్రయత్నాలు చేసింది. తన శరీరాన్ని పెంచిన ఇలియానాకు ఛాన్సులు దొరుకుతాయో లేదో వేచి చూడాలి.

చిత్రం ఇలియానా