బిచ్చగాడుకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదలైన అన్ని కేంద్రాలలో ‘బిచ్చగాడు’ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్‌కు ప్రేక్షకులనుండి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది అని నిర్మాత చదలవాడ తిరుపతిరావు తెలిపారు. విజయ్ ఆంటోని, సత్నాటైటస్ జంటగా తమిళంలో రూపొందించిన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గూర్చి నిర్మాత పలు విషయాలు తెలియజేస్తూ, తమిళంలో ఎంత హిట్ అయిందో, తెలుగులో కూడా అంతే సక్సెస్‌ఫుల్‌గా విడుదలైన అన్ని థియేటర్లలో రన్ అవుతోందని, మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న మాట మరోసారి నిజమైందని, ప్రతి షోకు, ప్రతిరోజూ ఆదరణ పెరుగుతోందని, అన్ని కేంద్రాలనుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంలో విజయ్ ఆంటోని నటన, సంగీతం, దర్శకుడు శశి టేకింగ్‌తో సహా ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆడియన్స్‌నుండి వస్తున్న ఆదరణను గుర్తించి థియేటర్లను పెంచుతున్నామని ఆయన అన్నారు.