కన్నడ సోగ్గాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సోగ్గాడే చిన్నినాయన’ నాగార్జున కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమా. 2016 సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాలలో సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమా. నూతన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లోనే అత్యధికంగా 50 కోట్లకుపైగా షేర్ సాధించి పెట్టింది. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయంతో మెప్పించిన విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాని కన్నడలో రీమేక్ చేస్తున్నట్టు తెలిసింది. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో తెలుగులో నాగార్జున చేసిన పాత్రను చేయబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉపేంద్ర తెలుగులో వచ్చిన ‘గోపాల గోపాల’ కన్నడ రీమేక్ ‘ముకుంద మురారి’లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తరువాత సోగ్గాడే సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం. ఇందులో రమ్యకృష్ణ పోషించిన పాత్రను కన్నడ నటి ప్రేమ పోషిస్తారట. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తారు.