శాతకర్ణితో శ్రీయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఇటీవలే మొరాకలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని చిలుకూరు దగ్గరలో జరుగుతోంది. ఇప్పుడు రెండో షెడ్యూల్‌కి చేరుకున్నా కూడా ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు? దాంతో హీరోయిన్‌కోసం అనే్వషణ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే నయనతార, అనుష్కల పేర్లు వినిపించాయి. కాని డేట్స్ కుదరక ఇద్దరూ నో చెప్పారు. ముఖ్యంగా నయనతారను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటింపచేసేందుకు తీవ్రంగా ట్రై చేశారు కాని కుదరలేదు. దాంతో ఇప్పుడు బాలయ్య సరసన హీరోయిన్‌గా శ్రీయ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహారాణి పాత్రలో శ్రీయ కరెక్టుగా సరిపోతుందని అంటున్నారు యూనిట్ వర్గాలు. పైగా శ్రీయకు ఇప్పుడు సినిమాలు ఏవీ చేతిలో లేకపోవడం కూడా కలసి వచ్చింది.