అవును..నిజమే.. అంటున్న సుధీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుడిగాలి సుధీర్ (జబర్దస్త్ ఫేం), శ్రావణి, మనీషా ప్రధాన తారాగణంగా సత్యశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై వరసాల సత్యనారాయణ రూపొందించిన చిత్రం ‘అవును.. నిజమే’. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి దర్శకుడు గూన అప్పారావు. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- హైదరాబాద్, అమలాపురం, కాకినాడ, కడియపు లంక, యానాం, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, త్వరలో ఆడియోను విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అందమైన ప్రేమకథతో ఇప్పటి యువతకు నచ్చేలా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీతం, కెమెరా పనితనం హైలెట్‌గా నిలుస్తాయని, సుడిగాలి సుధీర్ ఈ చిత్రంతో మంచి హీరోగా పేరు వస్తుందని తెలిపారు. సుమన్‌శెట్టి, జూ.రేలంగి, పొట్టి చిట్టిబాబు, అప్పారావు, గుండు సుదర్శన్, ఎఫ్.ఎం.బాబాయ్, బెన్నీ, అనూష, శ్రీదేవి, కావేరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రమణ కానూరి, కెమెరా:రవికుమార్ బైపల్లి, ఎడిటింగ్:పోచ సోమేశ్వరరావు, పాటలు:పవన్ శంకర్, నిర్మాత:సత్యనారాయణ వరసాల, దర్శకత్వం:గూన అప్పారావు.