ఇప్పుడే నటుడిగా మారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో విలన్‌గా తెరంగేట్రం చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. ఆ తరువాత అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయనకు ‘బాహుబలి’ చిత్రం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాలకేయుడిగా నటించిన ఆయన, ఇప్పుడు బిజీగా మారాడు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన ‘రైట్ రైట్’ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు ప్రభాకర్.
నటుడిగా ఊహించుకోలేదు
పోలీస్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. అనుకోకుండా నటుడిని అయ్యాను. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాను కానీ, నటుడిగా మారడానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులూ పడలేదు. నన్ను ఎక్కడో చూసిన రాజవౌళి, ‘మర్యాదరామన్న’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నాకు లైఫ్ ఇచ్చింది. ఆ తరువాత ‘బాహుబలి’తో నన్ను మరో మెట్టు ఎక్కించింది కూడా ఆయనే. ‘బాహుబలి’ సినిమా నుండి ‘రైట్ రైట్’ వరకూ నా ప్రయాణం సంతోషంగా సాగుతోంది. ‘బాహుబలి’ తరువాత నా పరిస్థితి తంతే గారెల బుట్టలో పడ్డట్టు అయింది. ఇప్పటివరకూ ఒక ఫైట్ లేకపోతే ఒక సీన్ అన్నట్లు వుండే నా నటనా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకూ సినిమా ఇండస్ట్రీ నాకు కొత్త. నాకు వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
పాజిటివ్ రోల్‌లో క నిపిస్తా
‘రైట్ రైట్’ చిత్రంలో నాది విలన్ రోల్ కాదు. ఓ పాజిటివ్ పాత్రలో కన్పిస్తాను. సెంటిమెంట్, ఎమోషన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఈ పాత్రలో వుంటాయి. కేరెక్టర్ ఆర్టిస్టుగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే సినిమా ఇది. ముఖ్యంగా సుమంత్ అశ్విన్‌తో నటించడం చాలా హ్యాపీగా వుంది. తను హీరోకంటే మంచి స్నేహితుడనే చెప్పాలి. మా ఇద్దరిమద్యా సన్నివేశాలు సినిమాకి హైలెట్‌గా వచ్చాయి.
డ్రైవర్ జీవితాల గురించి తెలిసింది
ఓ మారుమూల ప్రాంతంలో వుండే ఊరిలో బస్ డ్రెవర్‌గా నటించాను. ఆ పాత్ర పేరు శేషు. శ్రీకాకుళం యాసలో మాట్లాడే వ్యక్తి. ప్రతిరోజూ సాయంత్రం బయలుదేరిన బస్సు తరువాతి రోజు ఉదయానే్న మళ్లీ సిటీకి వస్తుంది. గ్రామంలో వుండేవారంతా డ్రైవర్‌తో చాలా సన్నిహితంగా వుంటారు. వైజాగ్ ప్రాంతంలో ఎస్.కోట నుండి గవిటికి ఈ బస్ ప్రయాణం చేస్తుంది. ఈ సినిమాతో డ్రైవర్ల జీవితాలు ఎలా వుంటాయో తెలిసింది. చిత్ర దర్శకుడు మనూ ఇదివరకే అనేక చిత్రాలకు పనిచేశారు. ప్రతి సీన్ మాతో ముందే డిస్కస్ చేసి సెట్స్‌కి వెళ్ళేవారు.
డాన్స్ చేశాను
ఈ సినిమాలో కొత్తగా నన్ను నేను చూసుకోవాలని, నా బాడీ లాంగ్వేజ్, లుక్స్.. ప్రతి విషయంలో కేర్ తీసుకున్నాను. ఈ చిత్రంలో నాతో డాన్స్ కూడా చేయించారు.
ఏడు సినిమాల్లో...
‘ఆక్సిజన్’ సినిమాలో టిపికల్ విలన్ పాత్రలో నటిస్తున్నాను. అలానే ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘కాలకేయ వర్సెస్ కాట్రవల్లి’ అనే చిత్రాలతోపాటుగా మలయాళంలో మోహన్‌లాల్‌తో మరో సినిమాలో నటిస్తున్నాను. కన్నడంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నాను. దర్శకుడు వినాయక్ కూడా ఓ మంచి పాజిటివ్ రోల్ ఇస్తారని చెప్పారు.

- శ్రీ