పగతీర్చుకునే నాగాభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమ్య, దివంగత విష్ణువర్థన్ ప్రధాన తారాగణంగా పెన్ మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో సాజిద్ ఖురేషి రూపొందించిన చిత్రం ‘నాగాభరణం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో శనివారం విడుదల చేశారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ట్రైలర్‌ను విడుదల చేసి కోడి రామకృష్ణ చిత్రాలు అంటే గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా వుంటాయని, గత 30 ఏళ్ళుగా ఆయనతో సినిమాలు తీస్తున్న తాను తరువాత కూడా ఆయనతోనే రూపొందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విష్ణువర్థన్ పాత్రను ఈ చిత్రంలో సృష్టి చేయడం ఓ కొత్త అనుభూతిగా తాము భావిస్తున్నామని, ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని మకుట గ్రాఫిక్స్ దొరబాబు తెలిపారు. కోడి రామకృష్ణ ఈ వయస్సులో కూడా ఇంత కష్టపడి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, దాదాపు మూడు సంవత్సరాలపాటు ఈ సినిమా కోసం పనిచేశామని, ఈనెలలో ఆడియో విడుదల చేసి వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సాజిద్ ఖురేషి తెలిపారు. పూర్వజన్మ కథనంతో రూపొందించిన ఈ చిత్రంలో తొలి జన్మలో కష్టాలు పాలైన అమ్మాయి, మరు జన్మలో పాముగా పుట్టి తన పగను ఎలా తీర్చుకుంది అన్న కథనంతో ఈ చిత్రం రూపొందించామని, తప్పక హిట్ అవుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు కోడిరామకృష్ణ అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:గురుకిరణ్, కెమెరా:వేణు, ఎడిటింగ్:జానీ హర్ష, నిర్మాతలు:జయంతిలాల్ గద, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కోడి రామకృష్ణ.