నచ్చే బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల విడుదలైన ‘శ్రీమతి బంగారం’ చిత్రం అందరికీ నచ్చే బంగారమని దర్శకుడు ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించారని ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు. రిషి, రాజీవ్ కనకాల, రిచాసిన్హా ప్రధాన తారాగణంగా వినయ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమతి బంగారం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ చిత్ర విశేషాలను తెలుపుతూ, అన్ని కేంద్రాలలో పాజిటివ్ టాక్ వచ్చిందని, దీంతో థియేటర్లు కూడా పెరుగుతున్నాయని, అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రంతో వినయ్‌బాబు గుర్తింపు పొందాడని ఆయన అన్నారు. సినిమా బాగుంటే చూస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి ఈ చిత్రంతో చెప్పారని, ఈ సినిమా మరింత విజయాన్ని అందుకోవాలని శంకర్ అన్నారు. ఓ చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎంతో సహకారం అందిస్తున్నారని, హీరోలు రాజీవ్, రిషి నిర్మాతల సహకారం బాగా వుండడంతో ఈ చిత్రాన్ని తాను రూపొందించానని దర్శకుడు వినయ్‌బాబు తెలిపారు. సంగీత దర్శకుడు సిద్ధబాపు మాట్లాడుతూ- ఆరోప్రాణం చిత్రాన్ని రీరికార్డింగ్ అందించిన తాను, సినిమాలకు దూరంగా వున్నానని, ఇప్పుడు ఈ చిత్రం కోసం దర్శకుడి కోరిక మేరకు సంగీతం అందించానని అన్నారు. ఇలాంటి చిత్రం విజయవంతమైనందుకు ఆనందంగా వుందని, మంచి సినిమాలను ప్రోత్సహిస్తే మరెన్నో మంచి చిత్రాలు వస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాదంబరి కిరణ్, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు.