తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం ‘రాయుడు’. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ, రాయుడు తన కెరీర్‌లో స్పెషల్ మూవీ అని, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగా చేశానని చెబుతున్నారని, తాను చేసిన ప్రయత్నానికి వచ్చిన గెలుపుఇదని అన్నారు. విలేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ చేయమని చాలామంది అడుగుతున్నారని, భవిష్యత్తులో అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు.ఈ సినిమా దర్శకుడు ముత్తయ్యతో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. థియేటర్‌లో ఈ సినిమా రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా అనిపించిందని, అమ్మ నా దగ్గరకి వచ్చి ఇప్పుడు కూడా నువ్వు తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం చేయకపోతే నీ అంత ఇడియట్ మరొకరు ఉండరని కోపంగా చెప్పిందని, ఖచ్చితంగా తెలుగులో సినిమా చేస్తానని అన్నారు. తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా కేరళ, కర్నాటక, ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తోందని, త్వరలోనే ‘పందెంకోడి-2’ అలానే తెలుగు స్ట్రెయిట్ ఫిలిం చేయబోతున్నామని, నా తదుపరి సినిమాను అక్టోబర్ 7న రిలీజ్ చేయాలనుకుంటున్నామని చెప్పారు. హరి మాట్లాడుతూ, విశాల్ రియల్‌లైఫ్‌లో కూడా హీరోనేనని, ఈ సినిమా మొదటివారంలో 5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని, రెండవ వారంలో కూడా 200 థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శిస్తున్నారని అన్నారు. శ్రీదివ్య మాట్లాడుతూ, భాగ్యలక్ష్మి లాంటి పవర్‌ఫుల్ పాత్రలు మళ్లీ మళ్లీ చేయాలనుందని అన్నారు.