రెగ్యులర్ షూటింగ్‌లో రోబో-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందిన రోబో చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నారు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల 12న ప్రారంభమైంది. నిజానికి రజనీ పుట్టినరోజున భారీగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నారు. కానీ, చెన్నై వరదల కారణంగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను వాయిదా వేయడంతో సైలెంట్‌గా ‘రోబో-2’ చిత్రం ప్రారంభమైంది. రేపటినుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం చెన్నై శివార్లలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరపనున్నారట. రజనీ సరసన గ్లామర్ భామ అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది.