ఆ లెక్చరర్ మనలో ఒకడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.పి.పట్నాయక్, అనిత హెచ్.రెడ్డి జంటగా యూని క్రాఫ్ట్స్ మూవీ పతాకంపై ఆర్.పి. దర్శకత్వంలో జి.సి.జగన్మోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.పి. మాట్లాడుతూ ఈనెల 16నుండి నెలాఖరు వరకు జరిపే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నామని అన్నారు. కృష్ణమూర్తి అనే సామాన్యమైన ఓ లెక్చరర్ కథగా సాగే ఈ చిత్రంలో కొన్ని యధార్థ సంఘటనలు ఉన్నాయని, బ్రోకర్ ఎంత విజయం సాధించిందో అంతకుమించిన స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత జగన్మోహన్ అన్నారు. నాలుగు పాటలతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో అన్ని పాటలు అందరికీ నచ్చుతాయని ఆయన అన్నారు. సాయికుమార్, నాజర్, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌రెడ్డి, శ్రీముఖి, రఘుబాబు, బెనర్జీ, గొల్లపూడి మారుతిరావు, రాజారవీంద్ర, జెమినీ సురేష్, దువ్వాసి మోహన్, సందేష్, గిరిధర్, వరుణ్, గుండు సుదర్శన్, కృష్ణవేణి, రాకేష్ తదితరులు నటిస్తున్నారు.