కృష్ణతో నటించడం అదృష్టం నటుడు ఆశిష్ గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ, విజయనిర్మల ప్రధాన పాత్రలో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్‌అవుతున్న శ్రీశ్రీ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషించాడు నటుడు ఆశిష్ గాంధీ. ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కిందని చెబుతున్న ఆశిష్ గాంధీ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో.. ‘కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆ పాత్ర చేసినందుకు చాలామంది బాగా చేశావు అని అభినందించారు. మొదటినుంచి నాకు సినిమాలంటే ఆసక్తి. మాది హైదరాబాద్ అయినా చిన్నప్పుడే ముంబాయిలో సెటిల్ అయ్యాను. తర్వాత అక్కడే రోషన్ తనేజ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. దాంతోపాటు మోడలింగ్, మార్షల్ ఆర్ట్స్ కూడా చేశాను. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని సినిమా అవకాశాలకోసం చాలా తిరిగాను. అలాంటి సమయంలో చాలా కష్టాల మధ్య పటాస్ సినిమాలో చాన్స్ దక్కింది. ఆ సినిమా తర్వాత ఓ రోజు ముప్పలనేని శివగారు పిలిచి శ్రీశ్రీలో ఓ మంచి పాత్ర వుంది చేయమని చెప్పారు. శ్రీశ్రీ చిత్రంలో చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ బాగా చేశామని అభినందిస్తున్నారు. ముఖ్యంగా లెజెండరీ నటుడైన కృష్ణగారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కృష్ణ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ఈ ఉత్సాహంతో విలన్ పాత్రల్లో నటించాలని వుంది. హీరోగా చేయాలంటే లక్ కావాలి కదా? ప్రస్తుతం తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. అలాగే తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నాను. నటుడిగా నాకు సూర్యంటే స్ఫూర్తి. నన్ను నేను ప్రూవ్ చేసుకునే పాత్రలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే’ అని అన్నారు.