అభిమానులకు స్టార్... నాకు దేవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో పవన్‌కల్యాణ్ అభిమానులు అతడిని పవర్‌స్టార్ అని పిలుస్తారని, కానీ తనకు దేవుడిలాంటివాడని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. సమర్పణలో శ్రీ శుభశే్వత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శే్వతలానా, వరుణ్, తేజ రూపొందిస్తున్న భారీ చిత్రం ‘లోఫర్’. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను సునీల్ కశ్యప్ సంగీత సారథ్యంలో విజయవాడ సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడారు. గతంలో పవన్‌కల్యాణ్ అభిమానులపై విమర్శలు చేసిన పూరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆడియో పాటలకు మంచి స్పందన వచ్చిన దృష్ట్యా చిత్రానికి సంబంధించిన ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలను విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాను చేసిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ తరువాత తల్లీకొడుకుల కథ కథనంతో కుటుంబమంతా కలిసి చూసేవిధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించానన్నారు. సునీల్ కశ్యప్ మంచి పాటలను ఇచ్చినందువల్లే ఆదరణ పెరిగి ప్లాటినమ్ డిస్క్ అందుకుందని, దిశాపటాని తొలి సినిమా అయినా బాగా నటించిందని తెలిపారు. చిరంజీవి పునాదిరాళ్ళనుండి నటిస్తూ ఎన్నో హిట్ చిత్రాలు కొట్టారని, కథ కథనాలు బాగాలేకపోయినా చిరంజీవి బాగా నటించలేదని ఎవరూ చెప్పలేదని, అలాంటి పేరును వరుణ్ సాధిస్తాడని ఆయన అన్నారు. వరుణ్‌తేజ్ ఎవరు అంటే ఈ సినిమా విడుదలయ్యాక అందరూ ఆయన అభిమానులుగా మారతారని, పూరి ఈ చిత్రాన్ని సరికొత్త విధానంలో చిత్రీకరించారని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. పెద్దనాన్న, బాబాయిలను చూస్తూ పెరిగిన తాను వారి అభిమానని, వారే తనకు ప్రేరణ అని, తప్పక వారి పేరు నిలబెడతానని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని కథానాయకుడు వరుణ్‌తేజ్ తెలిపారు. కార్యక్రమంలో దిశాపటాని, సునీల్ కశ్యప్, భాస్కరభట్ల, అశోక్‌కుమార్, అభిషేక్, అలంకార్ ప్రసాద్, ముత్యాల రాందాస్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని, ముఖేష్ రుషి, సంపూర్ణేష్‌బాబు, పవిత్రాలోకేష్, ఉత్తేజ్, భద్రం, శాండి, ధన్‌రాజ్, టార్జాన్, చరణ్‌దీప్, వంశీ, రమ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాధ్.