మూడు కోణాల్లో లచ్చిందేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయూఖా క్రియేషన్స్ పతాకంపై నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠి జంటగా జగదీష్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని రూపొందించిన చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. కథానాయిక లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ తలశిల మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో లచ్చిందేవి రూపొందిందని, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. కథానాయిక లావణ్య త్రిపాఠి మూడు వైవిధ్యమైన కోణాలలో కనిపించి ప్రేక్షకులను అలరిస్తుందని, ఈ రోజునుండి సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను కూడా మొదలుపెట్టామని నిర్మాత ప్రసాద్ తెలిపారు. ‘అందాల రాక్షసి’ చిత్రం తరువాత తాను, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె చాలా అందంగా కనిపిస్తోందని, ట్రైలర్లకు, పాటలకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో తమ టీమ్ పాజిటివ్ ఆలోచనలతో జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని కథానాయకుడు నవీన్‌చంద్ర అన్నారు. కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజి, అజయ్, నర్రా శ్రీను నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎం.ఎం.కీరవాణి, పాటలు:అనంత్ శ్రీరామ్, శివశక్తిదత్తా, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: ఈశ్వర్, నిర్మాత: సాయిప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.